Is Shah Rukh Khan Son Aryan Khan Dating With Nora Fatehi, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Aryan Khan -Nora Fatehi : తనకంటే 5ఏళ్లు పెద్దదైన హీరోయిన్‌తో ఆర్యన్‌ ఖాన్‌ డేటింగ్‌? ఫోటోలు వైరల్‌

Jan 5 2023 4:47 PM | Updated on Jan 5 2023 6:08 PM

Is Shah Rukh Khan Son Aryan Khan Dating Nora Fatehi - Sakshi

బాలీవుడ్‌లో సెలబ్రిటీల మధ్య లవ్‌ ఎఫైర్లు, రిలేషన్స్‌షిప్స్‌కు కొదువ లేదు, ఇప్పటికే చాలామంది స్టార్స్‌ డేటింగ్‌ వార్తలతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. తాజాగా షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ డేటింగ్‌ రూమర్స్‌ బీటౌన్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్‌ నోరా ఫతేహితో ఆర్యన్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా వీరిద్దరూ దుబాయ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్‌ కావడంతో ఈ రూమర్స్‌ తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్‌ వయసు 25ఏళ్లు కాగా, నోరాకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్‌ ఉంది.

ఇక రీసెంట్‌గా నోరా ఆర్యన్‌ సోదరి సుహానా ఖాన్‌తో కూడా డిన్నర్‌ పార్టీలో కనిపించింది. దీంతో నోరా-ఆర్యన్‌ల రిలేషన్‌ నిజమేనన్న టాక్‌ బలంగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్‌లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement