Pathan Movie Locks OTT Partner: కళ్లు చెదిరే ధరకు పఠాన్‌ ఓటీటీ రైట్స్‌? స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌ ఇదే!

Shah Rukh Khan Pathan Movie Lock This OTT Platform, Streaming Details Here - Sakshi

చాలా కాలం తర్వాత కింగ్‌ ఖాన్‌ షారుక్‌ బాలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించాడు. షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొనె జంటగా నటించిన ‘పఠాన్‌ ’జనవరి 25న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్‌ అయిన తొలి రోజే రూ. 50 కోట్లకు పైగా రాబట్టి మంచి ఓపెనింగ్‌ ఇచ్చింది. విడుదలైన 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల కలెక్షన్స్‌ చేసి బాయ్‌కాట్‌ గ్యాంగ్‌ నోరు మూయించాడు షారుక్‌.

చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించాడో తెలుసా?

వసూళ్లలో ఇప్పటికే కేజీయఫ్‌ 2, బాహుబలి వంటి పాన్‌ ఇండియా చిత్రాల రికార్డ్‌ బ్రేక్‌ చేసిన తొలి హిందీ చిత్రంగా పఠాన్‌ నిలిచింది. ఇక కలెక్షన్ల సునామీతో పఠాన్‌ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీసును షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లో అదే జోరును కొనసాగిస్తున్న పఠాన్‌ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదేనంటూ నెట్టింట ఓ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ భారీ ధరకు సొంతం చేసుకుందట. మేకర్స్‌తో అమెజాన్‌ కళ్లు చేదిరే ధరకు డీల్‌ కుదుర్చుకుందని సమాచారం. 

చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్‌.. వీల్‌ చైర్‌లోనే..

దీంతో ఈ చిత్రం థియేట్రికల్‌ రన్‌ అనంతరం రెండు నెలల్లోపే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. అంటే ఈ తాజా సమాచారం ప్రకారం.. పఠాన్‌ మూవీ మార్చి మొదటి లేదా రెండో వారంలో ఓటీటీలోకి విడుదల కానుందని తెలుస్తోంది. ఇక పఠాన్‌ స్ట్రీమింగ్‌, రిలీజ్‌ డేట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సినీవర్గాల నుంచి సమాచారం. కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హైవోల్టేజ్‌ యాక్షణ్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో జాన్‌ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top