షారుఖ్‌ ఖాన్‌ మేనేజర్‌ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Shah Rukh Khan Manager Pooja Dadlani Salary And Net Worth Details - Sakshi

సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లని కీలక పాత్ర. నటీనటులకు, నిర్మాతలకు వాళ్లు వారధుల్లా పని చేస్తుంటారు. హీరో హీరోయిన్ల డేట్స్‌ మొదలు.. పారితోషికం వరకు అన్ని వాళ్లే దగ్గర ఉండి చూసుకుంటారు. యాక్టర్స్‌ కూడా మేనేజర్లు ఏది చెబితే అది ఫాలో అవుతుంటారు. అందుకే దర్శక నిర్మాతలు మేనేజర్ల వెంబడి పడుతుంటాడు.  మీ హీరోతో మా సినిమా సెట్‌ చేయడంటూ విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రతీది మేనేజర్లే చూసుకోవాలని కాబట్టి.. స్టార్‌ హీరోహీరోయిన్లు చాలా నమ్మకస్తులను మేనేజర్లుగా నియమించుకుంటారు. వారితో ఏళ్లతరబడి స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ మేనేజర్‌ పూజా దద్లానీ ఒకరు. 

షారుఖ్‌ ఫ్యామిలీతో మంచి అనుబంధం
2012 నుంచి  షారుఖ్‌కు మేనేజర్‌గా పూజా దద్లానీ పని చేస్తుంది. షారుఖ్‌ సినిమా వ్యవహారాలే కాకుండా పర్సనల్‌ విషయాలలో ఆమె సలహాలు ఇస్తుంటారట. దశాబ్ద కాలానికి పైగా షారుఖ్‌తో కలిసి పనిచేయడంతో వారి ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. షారుఖ్‌ భార్య గౌరీఖాన్‌... పూజాను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటుంది. పలువురి సెలబ్రిటీల పార్టీలకు పూజాతో కలిసి వెళ్లింది. పూజ కూడా ఆ ఫ్యామిలీ కష్ట, సుఖాల్లో  మోరల్ సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘జవాన్‌’ చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా పూజా దద్లానీ కీలకంగా వ్యవహరించింది. 

భారీ వేతనం
షారుఖ్‌ ఖాన్‌ సంపాదన గురించి అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో షారూఖ్ ఖాన్ ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్‌ని స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా భారీగానే ఆర్జిస్తోంది. షారుఖ్‌ ఫ్యామిలీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల వరకు ఉంటుందట.

తమ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే పూజా దాద్లానీకి షారుఖ్‌ భారీ వేతనాన్ని అందిస్తున్నాడట. ఏడాదికి రూ.7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు పూజా వేతనం ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. పూజ కేవలం మేనేజర్‌గానే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారట.ఆమె సంపాదన నికర విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉటుందని సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకుంది. వీరికి రేనా దద్లానీ అనే కూతురు కూడా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top