
Seetharamapuramlo Oka Prema Janta Movie Wrap Up Shooting: ప్రతీ ప్రేమ జంట చూడాల్సిన చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట' అని ఆ సినిమా డైరెక్టర్ వినయ్ బాబు తెలిపారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథతో శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట'. ఎమ్. వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్గా తెరంగ్రేటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. జనవరి 29తో చిత్రీకరణ పూర్తవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.
సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగొచ్చిందని డైరెక్టర్ వినయ్ బాబు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకన్నా విభిన్నంగా ఉంటుందన్నారు. ప్రేమలో ఉన్న ప్రతీ జంట చూడాల్సిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా మంచి సందేశం ఇస్తున్నామని వెల్లడించారు. చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. త్వరలో మరో సాంగ్‌ను రిలీజ్ చేస్తామన్నారు. సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, జనవరి 28తో షూటింగ్ పూర్తవుతుందని వినయ్ తెలిపారు.