‘హిట్‌’ రీమేక్‌లో హీరోయిన్‌గా దంగల్‌ నటి ఖరారు!

Sanya Malhotra Is Finalized In Hit Hindi Remake Movie - Sakshi

ఇటీవల కాలంలో చిన్న సినిమాలు కంటెంట్‌ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన ఉప్పెన. ఇది చిన్న సినిమే అయినప్పటికీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కంటెంట్‌ చిత్రాలు ఇతర భాషల్లో కూడా రీమేక్‌ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్‌ రెడ్డి మూవీ హిందీలో కబీర​ సింగ్‌గా రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకోవడంతో ఇక బాలీవుడ్‌ మన తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్‌ పెడుతుంది. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న మన సినిమాలను హిందీలో రీమేక్‌ చేసేందుకు మేకర్స్‌ ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో యంగ్‌ అండ్‌ టాలెంటెట్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’ మూవీ కూడా హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. హిందీ రాజ్‌కుమార్‌ రావు హీరోగా తెరకెక్కతున్న ఈ రీమేక్‌లో.. తాజాగా హీరోయిన్‌ను కూడా ఖారారు చేసినట్లు మేకర్స్‌ వెల్లడించారు. దంగల్‌ మూవీ నటి సన్యా మల్హోత్రాను  హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్లు మేకర్స్‌ తెలిపారు. కాగా దంగల్‌లో ఆమె ఆమీర్‌ ఖాన్‌కు కూతురిగా కనిపించిన సంగతి తెలిసిందే. అర్జున్‌ రెడ్డితో పాటు జెర్సీ, బ్రోచేవారేవరురా, అలా వైకుంఠపురంలో, డీజే, నంది, రవితేజ ఖిలాడీ మూవీలో కూడా హందీ రీమేక్‌కు క్యూలో ఉన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top