నవ్వించే ప్రేమ్‌కుమార్‌ | Santosh Sobhan Speech At Prem Kumar movie | Sakshi
Sakshi News home page

నవ్వించే ప్రేమ్‌కుమార్‌

Published Sun, Aug 6 2023 4:41 AM | Last Updated on Sun, Aug 6 2023 4:41 AM

Santosh Sobhan Speech At Prem Kumar movie - Sakshi

సంతోష్‌ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’. రైటర్‌ అభిషేక్‌ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నమ్మడంవల్లే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది.

నా సినిమాల్లో నటించిన అభిషేక్‌ దర్శ కుడు అవుతాడని ఊహించలేదు. భవిష్యత్‌లో హ్యూమర్‌కి తనో బ్రాండ్‌ అవుతాడనిపిస్తోంది. ‘ప్రేమ్‌కుమార్‌’ రెండు గంటలు నవ్వించే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్‌ గుర్తొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అవే ΄ాత్రలను ఈ సినిమాలో చూస్తాం’’ అన్నారు అభిషేక్‌ మహర్షి. ‘‘ప్రేక్షకు లను నవ్వించాలని చేసిన సినిమా ఇది’’ అన్నారు శివ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement