విక్రమ్‌తో సినిమా.. కథ విన్న తర్వాత రిజెక్ట్‌ చేశారు: డైరెక్టర్‌ | Director Prem Kumar comments on Vikram | Sakshi
Sakshi News home page

విక్రమ్‌తో సినిమా.. కథ విన్న తర్వాత రిజెక్ట్‌ చేశారు: డైరెక్టర్‌

Sep 29 2025 10:35 AM | Updated on Sep 29 2025 10:47 AM

Director Prem Kumar comments on Vikram

కోలీవుడ్‌ నటుడు విక్రమ్‌కు పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఉన్నారు. ఆయనకు కథ నచ్చిందంటే అందులో నటించడానికి ఎంతవరకైనా వెళతారు. అయితే కథ ఆయనకు నచ్చాలి అంతే. వీరదీరసూరన్‌ చిత్రం తర్వాత విక్రమ్‌ ఇప్పటివరకు మరో చిత్రంలో నటించలేదు. అయితే పలు కథలు వింటున్నారు. అలా 96, సత్యం సుందరం చిత్రాల దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అది కూడా సెట్‌ పైకి వెళ్లలేదు. అందుకు కారణాలను దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ తెలుపుతూ.. తాను విక్రమ్‌ హీరోగా చిత్రం చేయాలని భావించినప్పుడు కథ రెడీ కాలేదని తెలిపారు. అయితే తన వద్ద ఉన్న రెండు కథలు సింగిల్‌ లైన్‌లను ఆయనకు వినిపించానని చెప్పుకొచ్చారు. 

అందులో విక్రమ్‌కు ఒక కథ నచ్చడంతో చేద్దామని కూడా చెప్పారు. దీంతో తాను పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసి విక్రమ్‌ కు చెప్పగా ఆయన ఈ స్క్రిప్టు కాదు మీరు చెప్పిన ప్రేమకథా చిత్రం చేద్దామని మరోసారి చెప్పారు. అయితే ఓ చిత్రానికి కథను సిద్ధం చేసిన తర్వాత మరో కథను రెడీ చేయడానికి చాలా సమయం పడుతుందని విక్రమ్‌తో తాను చెప్పానన్నారు. దీంతో విక్రం హీరోగా చేయాల్సిన కథ అలా నిలిచిపోయిందని దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. 

ఫహాద్‌ ఫాజిల్‌కు మలయాళంతో పాటు తెలుగు, తమిళంలోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఈయన ఇటీవల వడివేలుతో కలిసి నటించిన మారిశన్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో ఫాహత్‌ ఫాజిల్‌ నటించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement