‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది | Santhosh Soban Faria Abdullah Like Share And Subscribe Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Oct 24 2022 10:42 AM | Updated on Oct 24 2022 10:42 AM

Santhosh Soban Faria Abdullah Like Share And Subscribe Movie Gets Release Date - Sakshi

సంతోష్‌ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 4న విడుదల చేయనున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం ప్రకటించింది. సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న ప్రభాస్‌గారు విడుదల చేయనున్నారు.

ఇందుకు ఆయన అభిమానిగా చాలా ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’అన్నారు. ‘‘ఈ సినిమా ఓ ఫన్‌ రైడ్‌ ఫిల్మ్‌. మంచి థ్రిల్‌ ట్రిప్‌లా ఉంటుంది. ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించనున్నాం’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా ఇది’’ అన్నారు వెంకట్‌ బోయనపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement