సల్మాన్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉంటా : సల్లు భాయ్‌ మాజీ ప్రేయసీ | Sangeeta Bijlani on Relationship with Salman Khan | Sakshi
Sakshi News home page

Sangeeta Bijlani and Salman Khan: విడిపోయినా మేం మంచి స్నేహితులుగా ఉన్నాం: సల్మాన్‌ మాజీ ప్రేయసీ

Sep 19 2021 2:01 PM | Updated on Sep 19 2021 4:01 PM

Sangeeta Bijlani on Relationship with Salman Khan - Sakshi

కండల వీరుడు, బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నడిపిన ప్రేమయాణాల గురించి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్‌ సంగీత బిజ్లానీతో దాదాపు దశాబ్దం పాటు డేటింగ్‌ చేశాడు సల్లు భాయ్‌. పెళ్లిదాకా వచ్చిన వీరి బంధం ఎందుకో బెడిసికొట్టింది. అనంతరం బిజ్లానీ ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను వివాహం చేసుకుంది, అయితే 2010లో అతడితో విడాకులు తీసుకుంది.

(చదవండి: మెంటల్‌ వెకేషన్‌లో హైదరాబాద్‌ కోడలు)

అయితే ఇటీవల బిజ్లానీ ఓ ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమెను మీరు సినీ ఇండస్ట్రీలో ఎవరితో టచ్‌లో ఉంటారు అని అడగగా.. ‘సల్మాన్‌తో విడిపోయిన తర్వాత కూడా మేం మంచి స్నేహితులుగానే ఉ‍న్నాం అని తెలిపింది. ఎందుకంటే మేం స్నేహానికి గౌరవమిస్తాం’ అని సల్లు భాయ్‌ మూవీ ‘మైనే ప్యార్ కియా’లోని డైలాగ్‌ ఒకటి చెప్పింది. అలాగే మీనాక్షి శేషాద్రితో సన్నిహితంగా ఉంటానని, వారిద్దరూ కలిసి వరల్డ్‌ టూర్‌ చేసినట్లు తెలపింది.

మోడలింగ్‌ రోజుల నుంచి నేను కొల్పోయిన పాత స్నేహితులు అందరూ టచ్‌లోకి వచ్చారని, అందుకు కారణమైన సోషల్‌ మీడియాకి థ్యాంక్స్‌ చెప్పింది.  కాగా, పెళ్లి తర్వాత సినిమా నుంచి విరామం తీసుకున్న సంగీత అంతకుముందు త్రిదేవ్, హథ్యార్, జుర్మ్‌తో వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇటీవల డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్‌ ఓ ఎపిసోడ్‌లో కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement