మెంటల్‌ వెకేషన్‌లో హైదరాబాద్‌ కోడలు

Actress Sangeeta Bijlani Lifestyle, Family, Net worth - Sakshi

అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకున్నాక సంగీతా బిజిలానీ హైదరాబాద్‌ కోడలు అయ్యింది కానీ ఆమె ఇక్కడ ఉండేది తక్కువ. ముంబైలోనే ఎక్కువగా ఉంటారామె. పెళ్లి తర్వాత నటనకు దూరంగా గృహ జీవితానికే పరిమితమైన సంగీత యోగాను బాగా సాధాన చేస్తుంటారు. కుండలినీ శక్తిని జాగృతం చేయడం కోసం యోగా చేయాలని చెబుతుంటారామె. పత్రికల కథనం ఆమె ఆస్తిపాస్తులు 35 కోట్ల వరకూ ఉంటాయని. నటిగా ‘త్రిదేవ్‌’, ‘హత్యార్‌’, ‘జుర్మ్‌’ వంటి హిట్‌ సినిమాల్లో నటించారామె. అయితే నటిగా కంటే మోడల్‌గా సంపాదించింది ఎక్కువ. 1980లో ‘మిస్‌ ఇండియా’ అయిన సంగీత కుర్రాళ్ల కలల దేవతగా ఉండేది.

ఆమెను గెలుచుకున్న వీరుడు మాత్రం రెండో వివాహానికి సిద్ధపడ్డ అజారుద్దీన్‌. సంగీతా బిజిలానీకి ప్రకృతి అంటే ఇష్టం. ఆమె ప్రకృతి పరిసరాల్లో తిరుగుతూ ఆ ఫొటోలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెడుతూ ఉంటారు. ఆమెకు లోనావాలా దగ్గర ఒక ఫామ్‌హౌస్‌ ఉంది. అక్కడకు వెళుతుంటారు. ఇటీవల తండ్రితో వెళుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. లోనావాలకు దగ్గరగా ఉన్న పావ్నా సరస్సు దగ్గర కూడా ఆమె బస చేసిన ఫోటోలు ఉన్నాయి. ఇలా తిరగడాన్ని ఆమె ‘మెంటల్‌ వెకేషన్స్‌’ అంటారు. కరీనా కపూర్‌ వంటి నటీమణులు పెళ్లయిన వ్యక్తితో వివాహానికి సిద్ధపడి సంతానాన్ని కన్నా సంగీతా సంతానానికి దూరంగా ఉన్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top