గామి చాలా అరుదైన సినిమా | Sakshi
Sakshi News home page

గామి చాలా అరుదైన సినిమా

Published Fri, Mar 1 2024 2:36 AM

Sandeep Reddy Vanga Unveiled Trailer Of Gaami - Sakshi

 సందీప్‌ రెడ్డి వంగా 

‘‘గామి’ ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలాప్యాషన్‌ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్‌ డిజైన్, కలర్‌ గ్రేడింగ్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా అన్నారు. విశ్వక్‌ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకుడు. వి సెల్యులాయిడ్‌ సమర్పణలో కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలకానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతి తెలుగు ఫిల్మ్‌ మేకర్‌ గర్వంగా చెప్పుకునే సినిమా ‘గామి’. మా మూవీ బాగా ఆడితే చాలామంది కొత్త ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి వస్తారు. తెలుగోళ్లు కాలర్‌ ఎత్తుకునేలా చేశారు సందీప్‌ రెడ్డిగారు’’ అన్నారు. ‘‘గామి’ చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది’’ అన్నారు విద్యాధర్‌ కాగిత. ‘‘ఈ సినిమాకి ఫండింగ్‌ చేసి సపోర్ట్‌ చేసిన వారికి థ్యాంక్స్‌’’ అన్నారు కార్తీక్‌ శబరీష్‌. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు చాందనీ చౌదరి.

Advertisement
 
Advertisement