బాలీవుడ్‌లో సందీప్‌ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్‌ | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో కాంట్రవర్సీ రేపిన సందీప్‌ వంగా కామెంట్స్‌

Published Tue, Feb 6 2024 2:08 PM

Sandeep Reddy Vanga Comments On Kangana Ranaut And Kiran Rao - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ - సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన 'యానిమల్‌' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్‌ చేసి ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు  సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్‌ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్‌ ఎటాక్‌ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో సందీప్‌ వంగా పేరు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

మీ కుమారుడి 'మీర్జాపుర్‌' కోసం సలహాలు ఇవ్వండి
యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ పరోక్షంగా విమర్శించారు. యానిమల్‌ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్‌ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్‌ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు  జావేద్​ కుమార్​ ఫర్హాన్‌ అక్తర్‌కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్‌ సిరీస్‌లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్‌ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్‌ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్‌అక్తర్‌ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్‌ తెలిపాడు. 

నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్‌
బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా కూడా యానిమల్‌ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది  తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్‌ రియాక్ట్‌ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు.

దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్‌'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్‌లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు​. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. 

నేను సందీప్‌ గురించి కామెంట్‌ చేయలేదు: ఆమిర్‌ ఖాన్ మాజీ భార్య
యానిమల్‌ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్‌ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్‌ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్‌ వంగా సినిమాల గురించి కామెంట్‌ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్​ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు.

 
Advertisement
 
Advertisement