'యానిమల్'లో ఆ సీన్స్.. నా భార్యకు నచ్చలేదు: సందీప్ రెడ్డి | Sandeep Reddy Vanga Reveals How His Wife And Son Reacted After Watching Animal Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Animal Movie: ఏడేళ్ల కొడుక్కి 'యానిమల్' చూపించిన సందీప్.. రియాక్షన్ ఏంటో తెలుసా?

Published Wed, Feb 7 2024 12:44 PM

Sandeep Reddy Vanga Animal Watched By His Son And Wife - Sakshi

'యానిమల్' సినిమా రిలీజై రెండు నెలలకు పైనే అయిపోయింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా తనపై విమర్శలు చేసిన హీరో ఆమిర్ భార్య కిరణ్ రావ్, దిగ్గజ రైటర్ జావేద్ అక్తర్‌కి ఇచ్చిపడేశాడు. అది అలా ఉంచితే తాజాగా 'యానిమల్' చూసిన తర్వాత తన భార్య, కొడుకు ఎలా రియాక్ట్ అయ్యారనేది బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!)

సందీప్ రెడ్డిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిన సిద్ధార్థ్ కన్నన్‌.. ఈ సినిమా మీ ఏడేళ్ల కొడుక్కి చూపించారా? అతడి రియాక్షన్ ఏంటి? అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన సందీప్.. 'చూపించకూడని కొన్ని సీన్స్ ఎడిట్ చేసి 'యానిమల్' మూవీని ఓ హార్ట్ డిస్క్‌లో ఉంచా. ఏ రేటింగ్స్ సన్నివేశాలు లేని వెర్షన్‌ని గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా నా కొడుకు అర్జున్ రెడ్డికి చూపించాను. అది వాడికి బాగా నచ్చింది. అండర్‌వేర్ యాక్షన్ సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయని చెప్పాడు'

'నా భార్య మనీషా మాత్రం ఈ సినిమాలోని రక్తపాతం సీన్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయింది. స్త్రీ పాత్రలని చూపించిన విధానం గురించి మాత్రం పెద్దగా ఏం చెప్పలేదు. అయితే నేను తీసే చిత్రాలకు సరైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచి వస్తుంది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కనబెడితే సందీప్.. ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తాడు. దీని తర్వాత 'యానిమల్' సీక్వెల్, అనంతరం అల్లు అర్జున్‌తో మూవీ ఉంది. 

(ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్)

Advertisement
Advertisement