600 మెట్లు ఎక్కుతూ, ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ.. | Samantha Visits Palani Subramanya Swamy Temple | Sakshi
Sakshi News home page

Samantha: 600 మెట్లు ఎక్కుతూ, ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ..

Published Wed, Feb 15 2023 12:50 AM | Last Updated on Wed, Feb 15 2023 8:31 AM

Samantha Visits Palani Subramanya Swamy Temple - Sakshi

తమిళనాడులోని దిండిక్కల్‌ జిల్లాలో గల పళని సుబ్రహ్మణ్యస్మామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సమంత. కొంతకాలంగా మయోసైటిస్‌ (కండరాలకు సంబంధించిన వ్యాధి...)తో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు సమంత వైద్య చికిత్స తీసుకుంటున్నారు. కాగా, అనారోగ్యం నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతూ, పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత పూజలు చేశారు.

అలాగే ఈ ఆలయ దర్శనానికి సమంత దాదాపు 600 మెట్లు ఎక్కి వెళ్లారని, ప్రతి మెట్టుపై ఓ కర్పూరాన్ని వెలిగించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే... సమంత నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న రిలీజ్‌ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’లో హీరోయిన్‌గా, హిందీ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’లో నటిస్తున్నారు సమంత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement