Samantha Comments On Family Man 2 And Social Media Comments In Interview - Sakshi
Sakshi News home page

Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో ఆ ధైర్యం వచ్చింది: సమంత

Oct 22 2021 12:03 PM | Updated on Oct 22 2021 3:03 PM

Samantha Comments On Family Man 2 And Social Media Comments In Interview - Sakshi

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాము విడిపోతున్నామంటూ అక్టోబర్‌ 2న చై-సామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన అనంతరం నాగ చైతన్య సైలెంట్‌గా ఉన్నాడు. కానీ సమంత మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సామ్‌ ఎక్కువగా వార్తల్లోకెక్కుతున్నారు. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో చార్‌ధమ్‌ తీర్థయాత్రకు వెళ్లిన ఫొటోలను సామ్‌ షేర్‌ చేసుకుంది. ఇదిలా ఉంటే తన తాజా చిత్రం శాకుంతలం షూటింగ్‌ను ఇటీవల సామ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత ఓ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా శాకుంతలం చిత్రానికి సంబంధించిన విశేషాలతో పాటు తన సినీ కెరీర్‌, బాలీవుడ్‌ ఎంట్రీకి సంధించిన విషయాలను పంచుకున్నారు.

చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత

ఈ మేరకు సామ్‌ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా ఉపయోగం వల్ల లాభాలతో పాటు నష్టాలను కూడా ఉన్నాయన్నారు. ‘మనం ఇప్పుడు డిజిటల్‌ యుగంలో ఉన్నాం. ఈ కాలంలో కూడా నేను సోషల్‌ మీడియాకు దూరం అంటే అది వాళ్ల గొప్ప గుణమని నేను అనుకోను. ఎందుకంటే అలవాటు ఏదైన కానీ అది పరిమితికి మించి ఉండకూడదు. నియంత్రణలో ఉండాలి. ఇక సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌పై మాట్లాడటం కంటే కొన్ని సార్లు మౌనంగా ఉండటమే బాగుంటుంది. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే అది మౌనం కంటే బలంగా ఉండాలి. ఆ రోజే మాట్లాడతాను’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. తను నటించిన సినిమాలను స్క్రీన్‌పై చూడనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: వీకెండ్‌ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత

‘నా సినిమా వస్తుందంటే టీవీ ఆపేస్తాను. ఎందుకంటే నన్ను నేను స్రీన్‌పై చూసుకుంటే తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌ ప్రారంభంలో సినిమాల పట్ల నాకున్న భయం వల్ల పాత్రలు, కథల పరంగా ప్రయోగాలు చేయలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని రోటిన్‌గా, ఒకే తరహా సినిమాలు చేసినవి ఉన్నాయి. ఈ క్రమంలో ఒకటి గ్రహించాను. ఒకేలాంటి సినిమాలు చేయడానికి అలవాడు పడిపోయానా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. దీంతో వాటి నుంచి బయటకు వచ్చేందుకు నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నా. ధైర్యంగా సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. పాత్రలు, కథలతో ప్రమోగం చేయడానికి ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ నాకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చిందని తెలిపారు.

చదవండి: Esha Gupta: ‘ఒక చెంప మీద కొడితే, రెండు చెంపలు వాయిస్తా’ ఈషా ఫైర్‌

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ విజయం బాలీవుడ్‌ సినిమాలు చేసేలా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భయం వల్లే గతంలో హిందీ సినిమా ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదు. ఇక ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ నాలో ఆ భయాన్ని పోగొట్టింది. ఇక హిందీ సినిమా ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తాను’’ అని ఆమె స్పష్టం చేశారు. కాగా చై-సామ్‌ విడాకులను అక్కినేని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వారి విడాకులకు కారణాం ఏమై ఉంటుందా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ వారి విడాకులకు కారణం మాత్రం బయటకు రావడంతో లేదు. దీంతో సమంత వల్లే వారి దాపంత్యంలో మనస్పర్థలు వచ్చాయని, ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌ అభ్యంతరకర సన్నివేశాల్లో నటించడం, సామ్‌ సోషల్‌ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండటం వల్లే వారిమధ్య బంధం చెడిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement