Samantha Celebrates Vijay Devarakonda Birthday At VD11 Set, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda Birthday: విజయ్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన సమంత

May 9 2022 4:54 PM | Updated on May 9 2022 5:17 PM

Samantha Celebrate Vijay Devarakonda Birthday At VD11 Set - Sakshi

విజయ్‌ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా సమంత అతడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోమవారం(మే 9) విజయ్‌ పుట్టిన రోజు కావడంతో ఆదివారం రాత్రి అతడితో కేక్‌ కట్‌ చేయించింది సమంత. కాగా వీరిద్దరు ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు విజయ్‌ బర్త్‌డే కావడంతో సామ్‌ సెట్స్‌లో అతడి పుట్టినరోజును సెలబ్రేట్‌ చేయడమే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ విషెస్‌ తెలిపింది.

చదవండి: అశును వరస్ట్‌ కంటెస్టెంట్‌ అన్న రవి, షో మధ్యలో నుంచి వెళ్లిపోయిన నటి

కాగా మొన్నామధ్య సమంత బర్త్‌డే రోజు విజయ్ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ చేసినట్టే చేసి సమంత బర్త్‌డేని సెలబ్రేట్ చేశాడు. తాజాగా ఇప్పుడు సమంత వంతు వచ్చింది. విజయ్‌కు తెలియకుండానే సెట్‌లోనే అతడి బర్త్‌డే వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసింది సామ్‌. ఇందుకోసం ఓ రూం అంతా డెకరేట్‌ చేసి, మూవీ టీంతో స్పెషల్‌గా కేక్‌ తెప్పించింది. ఆదివారం అర్థరాత్రి సమంత, మూవీ టీం కలిసి విజయ్‌తో కేక్‌ కట్‌ చేయించారు. కాగా ఈ పార్టీలో డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement