ఫ్యాన్స్‌కు థాంక్స్‌ చెప్పిన సమంత.. కారణం ఇదే!

Samantha Akkineni Posts A Video After Clicking 15 Million Followers On Instagram - Sakshi

పెళ్లి అయితే చాలు హీరోయిన్లను పూర్తిగా దూరం పెట్టేవాళ్ళు దర్శకులు. ఒక వేళ వారికి చాన్స్‌ ఇచ్చిన మెయిన్‌ రోల్స్‌ మాత్రం ఇచ్చేవారు కాదు. కానీ సమంత అక్కినేని మాత్రం  ఈ రూల్స్ ని బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా ఉండొచ్చని ఆమె నిరూపించింది. పెళ్లి తర్వాతే ఈ స్టార్‌ హీరోయిన్‌  రంగస్థలం, ఓ బేబీ, మజిలీ, యూ టర్న్ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాలతో పాటు హోస్టింగ్, వెబ్ సిరీస్, బిజినెస్.. ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది.

వీటితో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అక్కినేని బ్యూటీ. తన వ్యక్తిగత విషయాలతో పాటు మూవీ అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తుంది. దీంతో సమంతకు సోషల్‌ మీడియాలో ఫుల్‌ క్రేజీ ఏర్పడింది. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె క్రేజీ తారాస్థాయిలో ఉంది.  తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటడమే అందుకు నిదర్శనం. దీంతో సమంత తన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.

‘ఇప్పుడే షూటింగ్ పూర్తి చేశాను. నాకో సర్‌ప్రైజ్ వచ్చినట్టు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్.. లైక్‌లు, కామెంట్లతో నన్నెంతగానో ప్రోత్సహించిన నా ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరింత ఉన్నతంగా పని చేయాలనే స్ఫూర్తిని కలిగించారు. లవ్యూ ఆల్’ అని వీడియోలో పేర్కొంది.  ఇక సినిమా విషయాలకొస్తే... ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 ద్వారా వెబ్‌ సిరీస్‌ల ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. ఫిబ్రవరి 12న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ రిలీజ్‌ కావాలి. అయితే దీన్ని వేసవికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top