వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకెళ్తున్న శ్యామ్‌ సీఎస్‌ | Sam CS Composed Music For The Night Manager Web Series | Sakshi
Sakshi News home page

Sam C.S: వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకెళ్తున్న శ్యామ్‌ సీఎస్‌

Feb 15 2023 10:18 AM | Updated on Feb 15 2023 10:18 AM

Sam CS Composed Music For The Night Manager Web Series - Sakshi

తమిళ సినిమా: చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌. తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో చిత్రాలు చేస్తూ పాన్‌ ఇండియా సంగీత దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారనే చెప్పాలి. కోలీవుడ్‌లో బిజీ సంగీత దర్శకుడు ఎవరంటే ముందుగా వినిపించేది ఈయన పేరే. కాగా విక్రమ్‌ వేద చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈయన తాజాగా ది నైట్‌ మేనేజర్‌ అనే హిందీ వెబ్‌ సిరీస్‌కు సంగీతాన్ని అందించడం విశేషం. ఇది 2016లో ఇదే పేరుతో ఆంగ్లంలో రూపొందింది. ఇప్పుడు దానికి హిందీలో రీమేక్‌ చేశారు. ఇందులో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ఫేమ్‌ శోభిత దూళిపాల, బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్, ఆదిత్య రాయ్‌ కపూర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

ప్రియాంక చోప్రా, ఫారుక్‌ నబీల్, నవీన్‌ సందీప్‌ మోడీ కలిసి నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ నెల 17వ తేదీ నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. దీనికి సంగీతాన్ని అందించడం మంచి అనుభవంగా శ్యామ్‌ సీఎస్‌ పేర్కొన్నారు. ఇంతకుముందే విక్రమ్‌ వేద చిత్రం రీమేక్‌ ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై మంచి గుర్తింపును తెచ్చుకున్నట్లు చెప్పారు. తాజాగా ది నైట్‌ మేనేజర్‌ వెబ్‌ సిరీస్‌కు ఎంతో అనుభవం కలిగిన అంతర్జాతీయ సంగీత కళాకారుల సహకారంతో సంగీతాన్ని అందించినట్లు చెప్పారు. ఈ వెబ్‌ సిరీస్‌కి వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement