16 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్న స‌ల్మాన్

Salman Khans Bigg Boss 14: Grand Premiere On September 27 - Sakshi

ముంబై : టెలివిజ‌న్ రంగంలో బిగ్‌బాస్ మ‌ళ్లీ సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా బిగ్‌బాస్ సీజ‌న్ 14 సెస్టెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది. క‌రోనా నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్య షోని ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే సెట్స్ వ‌ర్క్ పూర్తిచేసే ప‌నిలో ఉంది. ఈ నెల‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 14 ప్రోమో కోసం స‌ల్మాన్ షూట్ చేయ‌నున్నారు. ఈ సీజ‌న్ కోసం స‌ల్మాన్ భారీ పారితోషికాన్ని అందుకోనున్నారు. దాదాపు 16 కోట్ల రెమ్యున‌రేష‌న్ అడిగిన‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్ 27 నుంచి ఈ షో క‌లర్స్ చానెల్‌లో ప్ర‌సారం కానున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. పోటీదారుల‌కు ముందే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హౌస్ లోప‌లికి పంపనున్నారు. (బిగ్‌బాస్‌-4: భారీ ఆఫర్‌.. నో చెప్పిన హీరోయిన్‌?)

హిందీ వెర్ష‌న్ బిగ్‌బాస్ ప్రోమో ఈ నెల చివ‌రి వారంలో ప్రసారం కానుంది. టెలివిజ‌న్ రంగంలో బిగ్‌బాస్ క్రేజ్ అంతా ఇంతా కాదు. రేటింగ్స్‌లో దూసుకెళ్లే బిగ్‌బాస్ షోకి ఈసారి మాత్రం ఐపీఎల్ పోటీ ఇవ్వ‌నుంది. అంతేకాకుండా ప్ర‌ఖ్యాత న‌చ్ బ‌లియే షో కూడా త్వ‌ర‌లోనే ప్ర‌సారం చేయ‌డానికి స్టార్ ప్ల‌స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి వీటి మ‌ధ్య బిగ్‌బాస్ సీజ‌న్ 14 ఎటువంటి రేటింగ్స్‌ని రాబ‌డుతుందో వేచి చూడాలి. మ‌రోవైపు ఈ సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారన్న విష‌యంపై ఇప్ప‌టికే పలు వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నేహా శర్మ, వివియన్ ద్సేనా, హర్ష్ బెనివాల్, నియా శర్మ. అలీ గోని, నిఖిల్ చిన్నపా, అసీమ్ మర్చంట్, అవినాష్ ముఖర్జీ, షిరీన్ మీర్జా, సుగంధ మిశ్రా, జే సోని, కరణ్ కుంద్రా, ఆలిషా పన్వర్ షాగున్ పాండే, ఆరుషీ దత్తా, మిషాల్ రహేజా పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

ఇంత‌కుముందు సీజన్ లాగా కాకుండా ఈసారి మాత్రం షో కొంచెం భిన్నంగా ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. చివ‌రి సీజ‌న్ మాదిరి 13 మంది కంటెస్టెంట్‌లు కాకుండా ఈసారి 16 మంది ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురు సాధారణ పౌరులు ఉంటార‌న్న మాట‌. మ‌రి బిగ్‌బాస్ సీజ‌న్ 14 టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఏ విధంగా దూసుకెళ్తుంది? క‌రోనా నేప‌థ్యంలో ఎటువంటి టాస్క్‌లు ఉంటాయ‌న్నది తెలియాలంటే మ‌రికొంత స‌మ‌యం వేచి చూడాల్సిందే. (బిగ్‌బాస్‌ ఈజ్‌ బ్యాక్‌)

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top