Salman Khan, Venkatesh Celebrates Pooja Hegde Birthday At Movie Set - Sakshi
Sakshi News home page

Pooja Hegde Birthday: సెట్‌లో పూజా బర్త్‌డే సెలబ్రెట్‌ చేసిన సల్మాన్‌ ఖాన్‌, వెంకటేశ్‌.. వీడియో వైరల్‌

Published Thu, Oct 13 2022 7:04 PM

Salman Khan, Venkatesh Celebrates Pooja Hegde Birthday At Movie Set - Sakshi

పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇందులో టాలీవుడ్‌ హీరో విక్టరి వెంకటేశ్‌, విలక్షణ నటుడు జగపతి బాబులు కీ రోల్‌ పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు పూజా బర్త్‌డే. ఈ సందర్భంగా సెట్‌లో సల్మాన్‌ ఖాన్‌, వెంకటేశ్‌లు ఆమె బర్త్‌డే సెలబ్రెట్‌ చేశారు.

చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్‌ దివి..

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా పూజా ‘నేను ఎక్కువ ప్రేమించేది నా పనిని, షూటింగ్‌ని. అలాంటి షూటింగ్ సెట్‌లోనే నేను కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషకంగా ఉంది. ఇది నాకు ఓ మధుర జ్ఞాపకం. ఆన్‌ సెట్స్‌లో బర్త్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె పేర్కొంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement