లవ్‌ యూ వాజిద్‌.. ఎమోషనల్‌ అయిన సల్మాన్‌ | Salman Khan Cuts Cake On Late Composer Wajid Khan's Birth Anniversary | Sakshi
Sakshi News home page

Salman Khan: మ్యూజిక్‌ డైరెక్టర్‌ వాజిద్‌ జయంతి.. కేక్‌ కట్‌ చేసి ఎమోషనల్‌ అయిన సల్మాన్‌

Oct 9 2021 1:07 PM | Updated on Oct 9 2021 1:41 PM

alman Khan Cuts Cake On Late Composer Wajid Khan's Birth Anniversary - Sakshi

బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ద్వయం సాజిద్-వాజిద్ తమ సంగీతంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందులో ఒకరైన వాజిద్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌..

బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ద్వయం సాజిద్-వాజిద్ తమ సంగీతంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందులో ఒకరైన వాజిద్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మంచి స్నేహితులు. అయితే వాజిద్‌ గతేడాది జూన్‌లో మరణించాడు.

అయితే తాజాగా ఆయన మరణం తర్వాత వచ్చిన మొదటి జయంతి వేడుకలను సల్మాన్‌ నిర్వహించాడు. ఆయన కేక్‌ కట్‌ చేసిన వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అందులో.. ‘మేము నిన్ను లవ్‌ చేస్తున్నాం వాజిద్‌. ప్రపంచం మొత్తం ప్రేమిస్తోంది. హ్యపీ బర్త్‌ డే’ అంటూ సల్లుభాయ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సల్మాన్‌ ప్రస్తుత డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న ఇలియా వంతూర్ కూడా ఉండడం విశేషం.

అయితే గతేడాది జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో సైతం వాజిద్‌తో కలిసి ఈ కండల వీరుడు కేక్‌ కట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆ వీడియో సైతం వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ద్వయం సల్మాన్‌ సినిమా ‘ప్యార్ కియా తో డర్నా క్యా’తో కంపోజర్స్‌గా కెరీర్‌ ప్రారంభించారు. దాంతో వారి మధ్య అప్పటి నుంచి మంచి అనుబంధం ఏర్పడింది.

చదవండి: స‌ల్మాన్ ఖాన్‌ని డైరెక్ట్‌ చేయనున్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement