రిలీజైన 'సలార్' సాంగ్.. ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు! | Prabhas Salaar Movie First Single Sooreede Is Out - Sakshi
Sakshi News home page

Salaar Song: లిరికల్ పాటతో స్టోరీపై హింట్ ఇచ్చేసిన 'సలార్' టీమ్

Published Wed, Dec 13 2023 7:26 PM

Salaar Movie Sooreede Song Telugu Prabhas - Sakshi

ప్రభాస్ 'సలార్' మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే మూవీ టీమ్.. కనీసం ప్రచారం లాంటి వాటి జోలికి వెళ్లకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా పక్కనబెడితే తాజాగా సినిమాలోని ఓ పాట రిలీజ్ చేశారు. అదయితే ఫ్యాన్స్‌కి మాములు షాక్ ఇవ్వలేదు. ఇంతకీ ఈ పాట ఎలా ఉంది? సాంగ్‌తో స్టోరీ హింట్ ఇచ్చారా?

(ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!)

'కేజీఎఫ్' తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో మాస్ సినిమా తీస్తున్నాడనేసరికి ఫ్యాన్స్ చొక్కాలు చింపేసుకున్నారు. మాస్ బొమ్మ గ్యారంటీ అని ఊగిపోయారు. కానీ వాయిదాల వాయిదాల పడటంతో సినిమాపై స్వయంగా అభిమానులకే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన పాట అయితే ఎలివేషన్స్ ఉన్న హీరోయిక్ సాంగ్ కాకుండా ఎమోషనల్‌గా ఉంది.

ఈ పాటలో సాహిత్యం బాగుంది, 'సలార్' మూవీ ఎలా ఉండబోతుందనే హింట్ కూడా ఇచ్చారు. మూవీ రిలీజ్ పెట్టుకున్న ఈ టైంలో.. మంచి హై ఇచ్చే సాంగ్ రిలీజ్ చేయాలి గానీ ఇలాంటి ఎమోషనల్ పాట విడుదల చేసేరేంటి? అని డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఏదేమైనా సరే సినిమా బాగుంటే.. ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో? డిసెంబరు 22 వరకు వెయిట్ చేస్తే 'సలార్' రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది!

(ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్)

Advertisement
 
Advertisement
 
Advertisement