జైలర్‌, బాహుబలి రికార్డ్స్‌ను కొట్టేసిన సలార్‌ కలెక్షన్స్‌ | Sakshi
Sakshi News home page

Salaar Collection Day 11: జైలర్‌, బాహుబలి రికార్డ్స్‌ను కొట్టేసిన సలార్‌ కలెక్షన్స్‌

Published Tue, Jan 2 2024 3:11 PM

Salaar Movie 11 Days Collections - Sakshi

ప్రపంచవ్యాప్తంగా సలార్‌ అన్నీ థియేటర్‌లలో సందడి చేస్తోంది. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ  మువీ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్‌ రాబడుతుంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత కలెక్షన్స్‌ పరంగా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కాస్త పుంజుకుంది. 

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'లియో' సినిమా మొత్తం కలెక్షన్లను సలార్‌ అధిగమించింది. ప్రభాస్ 'బాహుబలి: ది బిగినింగ్' రికార్డును బద్దలు కొట్టేందుకు కూడా సలార్‌ సిద్ధమైంది. అలాగే తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రికార్డు కూడా మరో రెండు రోజుల్లో బద్దలయ్యే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, సలార్ 11వ రోజు (సోమవారం) రూ.15.5 కోట్లు వసూలు చేసింది.  దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టోటల్ కలెక్షన్ రూ.400 కోట్లు రాబట్టగా..  ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 650 కోట్ల రూపాయలను రాబట్టింది.

బాహుబలి పార్ట్ వన్ సినిమా టోటల్ కలెక్షన్ 650 కోట్లు. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు  సిద్ధమయ్యాడు.  ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ 'లియో' చిత్రాన్ని 'సాలార్' అధిగమించింది. లియో ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయలు సంపాదించింది. అలాగే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’ మొత్తం కలెక్షన్స్‌ దాదాపు రూ. 655 కోట్ల రూపాయలు. మరో రెండు రోజుల్లో జైలర్‌, బాహుబలి రికార్డ్స్‌ను సలార్‌ బీట్‌ చేయడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు.

ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో జరిగే స్నేహితుల కథ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రానికి డంకీ పోటీ లేకపోతే బాలీవుడ్‌లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు. అంతేకాకుండా కార్పోరేట్‌ బుకింగ్స్‌ పేరుతో కూడా సలార్‌ కలెక్షన్స్‌ కొంతమేరకు దెబ్బతిన్నాయి. ఏదేమైనా సలార్‌ పార్ట్‌-2 మీద భారీ అంచనాలు క్రియేట్‌ చేయడంలో ప్రశాంత్‌ నీల్‌ సక్సెస్‌ అయ్యాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement