రావణుడు

Saif Ali Khan as the epic villain in Prabhas starrer Adipurush - Sakshi

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ‘తానాజీ’ ఫేమ్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్, ఓం రౌత్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నారు. మరి రాముడికి ప్రతినాయకుడు అంటే రావణుడే కదా. ఆ పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ చేయనున్నారు.

ఓం రౌత్‌ మాట్లాడుతూ– ‘‘7000 ఏళ్ల కిందట ఉన్న ఓ తెలివైన రాక్షసుని స్వభావాన్ని ప్రేరణగా తీసుకుని సైఫ్‌ క్యారెక్టర్‌ తీర్చిదిద్దుతున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, సైఫ్‌ మధ్య కత్తి యుద్ధాలు, పోరాటలు అత్యద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ప్రభాస్‌కి దీటైన విలన్‌ దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్రకు సైఫ్‌ పర్‌ఫెక్ట్‌గా సరిపోతారని నా నమ్మకం. ఈ ఎపిక్‌ డ్రామాను భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నాం’’ అన్నారు భూషణ్‌ కుమార్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top