
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి డ్రెస్ స్టైల్ అంటే సింప్లిసిటీకి, ఎలిగెన్స్‌కి అద్దం పడుతుంది. ఆమె ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్‌లను ఇష్టపడుతుంది. శారీస్, కుర్తాస్, అనార్కలీస్ వంటి డిజైన్స్‌లలో కనిపిస్తుంది. భారీ బడ్జెట్ సినిమా, ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పిన సరే గ్లామరస్ పాత్రలకు నో చెబుతుంది. అయితే, రీసెంట్‌గా తన సోదరి పూజా కన్నన్‌తో కలిసి సాయిపల్లవి స్విమ్ సూట్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు నెటిజన్లు తప్పుబడుతున్నారు. కానీ, ఆమె అభిమానులు మాత్రం సాయిపల్లవికి అండగా నిలబడుతున్నారు.
సాయి పల్లవిపై ట్రోల్స్
సాయి పల్లవి బికినీ ఫొటోలపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. కేవలం సినిమాల్లో మాత్రమే పద్ధతిగా ఉంటానని చెప్పి ఇలా బికినీలో ఫోజులు ఇచ్చి తన అసలు రంగు బయటపెట్టిందని విమర్శిస్తున్నారు. బాలీవుడ్‌లో మరిన్ని ఛాన్స్‌ల కోసమే ఆమె ఇలాంటి ప్లాన్ వేసిందని చెప్పుకొచ్చారు. కేవలం తనదంతా ఒక ట్రాప్ అంటూ తప్పబట్టారు. సాయిపల్లవిలో ఎలాంటి ప్రత్యేకత లేదని అందరి హీరోయిన్లలాగే అంటూ పేర్కొన్నారు. తన నుంచి ఇలాంటి ఫోటోలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని మరికొందరు చెబుతున్నారు.
ఏఐ టెక్నాలజీతో మాయ
సాయి పల్లవి అభిమానులు మాత్రం ట్రోలింగ్ చేస్తున్న వారిపై కౌంటర్లు విసురుతున్నారు. ఆమె బికినీ ధరించలేదని కేవలం స్విమ్ సూట్‌తో మాత్రమే నీటిలోకి దిగారని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా సాయిపల్లవి స్విమ్ సూట్ మాత్రమే ధరించింది. కానీ, ఏఐ టెక్నాలజీ సాయంతో వాటిని మార్ఫింగ్ చేసి మరికొందరు వైరల్ చేశారు. దీంతో సాయి పల్లవి బికినీ ధరించిందంటూ అందరూ నమ్మేశారు. తన సోదరితో ఆఫ్ ఫోటోస్ మాత్రమే ఆమె పంచుకుంది. కానీ, అందరినీ ఏఐ టెక్నాలజీ నమ్మించేలా చేసింది.

చీర కట్టుకుని వెళ్తారా..?
బీచ్‌లో ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో..? చెప్పాలని సాయి పల్లవి అభిమానులు తిరిగి ప్రశ్నిస్తున్నారు. చీర కట్టుకుని ఎవరైన స్విమ్ చేయడానికి వెళ్తారా...? మన ఇంట్లో ఉన్న వాళ్లు కూడా స్విమ్ సూట్ ధరించే నీటిలోకి దిగుతారు కదా అంటూ సమాధానం ఇస్తున్నారు. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా సాయిపల్లవి ఇష్టమని గుర్తుచేశారు. పంచకట్టుకుని ఎవరైనా ఈత కొడతారా..? లేదు కదా! తమకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరించే నీటిలోకి దిగుతారు. అలాంటప్పుడు సాయిపల్లవిని మాత్రమే ట్రోలింగ్ చేయడం ఎందుకు.. ఇది ఆమె ఎంపిక మాత్రమే.. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీకు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు.