పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే? | Sakshi
Sakshi News home page

Sai Pallavi Sister: అక్క కంటే చెల్లికే ముందు పెళ్లి? బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిందిగా

Published Mon, Jan 15 2024 5:11 PM

Sai Pallavi Sister Pooja Kannan Boyfriend And Marriage Details  - Sakshi

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అదేంటి సాయిపల్లవి చెల్లి కూడా హీరోయినా? ఏ సినిమా చేసింది అని మీకు డౌట్ వచ్చింది కదా! అవును సాయిపల్లవి సోదరి పూజ కూడా యాక్టరే. కాకపోతే ఒక్కటంటే ఒక్క మూవీ చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. మలయాళ 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. 'ఫిదా' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'పడిపడి లేచే మనసు', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'విరాటపర్వం' లాంటి సినిమాలతో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు డాక్టర్ కోర్సు పూర్తి చేసి.. సినిమాలతో హిట్స్ కొట్టేసింది. ప్రస్తుతం 'తండేల్' అనే తెలుగు మూవీ, తమిళంలో శివకార్తికేయన్ మూవీలోనూ నటిస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?)

ఇక సాయిపల్లవి చెల్లి పూజకన్నన్ స్వతహాగా సోషల్ వర్కర్. కాకపోతే తమిళంలో 'చిత్తరాయి సెవ్వనం' అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత మరి ఛాన్సులు రాలేదో ఏమో గానీ పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమైపోయింది. ఇప్పుడు ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇతడి పేరు వినీత్ అని, మొన్నటివరకు తన క్రైమ్ పార్ట్‌నర్, ఇప్పుడు లైఫ్ పార్ట్‌నర్ అని చెప్పుకొచ్చింది. కానీ అతడి మిగతా డీటైల్స్ లాంటివి ఏం చెప్పలేదు.

ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలని రీల్ వీడియోగా పోస్ట్ చేసింది. ఇది చూసిన అందరూ సాయిపల్లవి చెల్లికి శుభాకాంక్షలు చెబుతున్నారు. బహుశా త్వరలో వీళ్ళ పెళ్లి ఉండొచ్చనిపిస్తోంది. ఏదేమైనా సాయిపల్లవి కంటే ఆమె చెల్లెలే ముందు పెళ్లి చేసుకోనుందనమాట.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)

Advertisement
 
Advertisement
 
Advertisement