సాయి పల్లవి హిట్‌ సినిమా రీ రిలీజ్‌.. భారీగా కలెక్షన్స్‌ | Sakshi
Sakshi News home page

సాయి పల్లవి హిట్‌ సినిమా రీ రిలీజ్‌.. భారీగా కలెక్షన్స్‌

Published Tue, Feb 6 2024 9:51 AM

Sai Pallavi Premam Movie Re Released Create Record - Sakshi

టీవీ రియాలిటీ డ్యాన్స్‌ షో నుంచి  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన  సాయిపల్లవికి లైఫ్‌ ఇచ్చిన చిత్రం ప్రేమమ్‌. తన పర్‌ఫార్మెన్స్‌తో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించి ప్రేమమ్‌ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి పోషించిన మలర్‌ పాత్రను మూవీ లవర్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ సినిమా హిట్‌ కావడంతో తెలుగులో శేఖర్‌ కమ్ముల డైరెక్ట్‌ చేసిన ఫిదాలో భానుమతిగా దుమ్మురేపింది. ఇదే చిత్రంతోనే సాయిపల్లవితో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా ఇద్దరు టాప్‌ హీరోయిన్లను ప్రేమమ్‌ సినిమా అందించింది.

మలయాళంలో ఎప్పటికీ గుర్తుండుపోయే సినిమా ప్రేమమ్‌.. ఇందులో మలయాళ హీరో నవీన్ పాల్​, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్​, మడోన్నా సెబాస్టియన్​ కలిసి నటించారు. మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ కొట్టి సాయి పల్లవి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా ఫిబ్రవరి 1న ప్రేమమ్‌ సినిమా మలయాళం,తమిళ్‌లో రీరిలీజ్‌ అయింది. రెండు రాష్ట్రాల్లో మళ్లీ రికార్డులు బద్దలు కొడుతుంది. విడుదలైన ఐదురోజుల్లోనే సుమారు రూ. 2 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది.  తమిళ్‌,మలయాళంలో రీరిలీజ్‌ అయిన చిత్రాల్లో ప్రేమమ్‌ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రేమమ్‌ చిత్రాన్ని ఆదరించడం చాలా సంతోషంతో పాటు ఎంతో సర్‌ప్రైజ్‌గా ఉందని ఆమె తెలిపింది. ప్రేమమ్ చిత్రం రీరిలీజ్ కావడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు మూడోసారి. మొదటసారి 2016లో వాలెంటైన్స్ డే సందర్భంగా తమిళంలో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఆ తర్వాత 2017లో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ రీరిలీజ్ అయింది. విడుదలైన మూడుసార్లు కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ దక్కింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో  ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రేమమ్‌ సినిమా  2015లోనే ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

 
Advertisement
 
Advertisement