breaking news
Anupam Parameswaran
-
‘టిల్లు’భామ : చీరలో స్టన్నింగ్ అండ్ గ్లామర్ లుక్స్ (ఫోటోలు)
-
సాయి పల్లవి హిట్ సినిమా రీ రిలీజ్.. భారీగా కలెక్షన్స్
టీవీ రియాలిటీ డ్యాన్స్ షో నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిపల్లవికి లైఫ్ ఇచ్చిన చిత్రం ప్రేమమ్. తన పర్ఫార్మెన్స్తో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించి ప్రేమమ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి పోషించిన మలర్ పాత్రను మూవీ లవర్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదాలో భానుమతిగా దుమ్మురేపింది. ఇదే చిత్రంతోనే సాయిపల్లవితో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా ఇద్దరు టాప్ హీరోయిన్లను ప్రేమమ్ సినిమా అందించింది. మలయాళంలో ఎప్పటికీ గుర్తుండుపోయే సినిమా ప్రేమమ్.. ఇందులో మలయాళ హీరో నవీన్ పాల్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కలిసి నటించారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి సాయి పల్లవి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఫిబ్రవరి 1న ప్రేమమ్ సినిమా మలయాళం,తమిళ్లో రీరిలీజ్ అయింది. రెండు రాష్ట్రాల్లో మళ్లీ రికార్డులు బద్దలు కొడుతుంది. విడుదలైన ఐదురోజుల్లోనే సుమారు రూ. 2 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. తమిళ్,మలయాళంలో రీరిలీజ్ అయిన చిత్రాల్లో ప్రేమమ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రేమమ్ చిత్రాన్ని ఆదరించడం చాలా సంతోషంతో పాటు ఎంతో సర్ప్రైజ్గా ఉందని ఆమె తెలిపింది. ప్రేమమ్ చిత్రం రీరిలీజ్ కావడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు మూడోసారి. మొదటసారి 2016లో వాలెంటైన్స్ డే సందర్భంగా తమిళంలో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఆ తర్వాత 2017లో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ రీరిలీజ్ అయింది. విడుదలైన మూడుసార్లు కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ దక్కింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రేమమ్ సినిమా 2015లోనే ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. -
వినాయక చవితి కు రిలీజ్ అవ్వనున్న టిల్లు స్క్వేర్
-
‘రాక్షసుడు’ సక్సెస్ సెలబ్రేషన్
-
ప్రేమమ్ కాంబినేషన్లో మరో సినిమా
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమమ్. మలయాళ సూపర్ హిట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కార్తీకేయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటి ప్రేమమ్ సక్సెస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. మలయాళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన చందూ అక్కినేని హీరోలతో మరో ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పనులను దాదాపుగా పూర్తి చేసిన నాగచైతన్య, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రేమమ్ కాంబినేషన్ సినిమాను నిర్మిస్తోంది.