Sai Dharam Tej Next Movie With Sampath Nandi - Sakshi
Sakshi News home page

యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్‌ లిస్ట్‌లోకి సంపత్‌ నంది.. మాస్ మసాలా మూవీతో రీఎంట్రీ

Dec 21 2021 5:00 PM | Updated on Dec 21 2021 6:00 PM

Sai Dharam Tej Next Movie With Sampath Nandi - Sakshi

బైక్ యాక్సిడెంట్ తర్వాత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యాడు సాయి ధరమ్ తేజ‌్. ఈ ఏడాది సుప్రీమ్ నటించిన ఏకైక చిత్రం రిపబ్లిక్  అక్టోబర్‌1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలై అక్కడ మంచి ఆదరణ అందుకుంది. అందుకే నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అందు కోసం పర్ఫెక్ట్ డైరెక్టర్స్ ను సెట్ చేసుకుంటున్నాడు. త్వరలోనే కార్తిక్ దండు దర్శకత్వంలో నటించాల్సిన సినిమాను పట్టాలెక్కించనున్నాడు సాయి తేజ్‌. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
(చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు)

ఈ సినిమాతో పాటు కోలీవుడ్ సూపర్ హిట్ మానాడు తెలుగు రీమేక్ లోనూ ఈ సుప్రీమ్‌ హీరో నటించాలనుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. తాజాగా సాయితేజ్‌ లిస్టులోకి సంపత్‌ నంది వచ్చాడు. ఇప్పుడు ఈ దర్శకుడితో మూవీ చేయాలనుకుంటున్నాడట సాయి ధరమ్ తేజ్. మైత్రీ మూవీ మేకర్స్ వీరిద్దరి కాంబినేషన్ లో మాస్ మూవీ ప్లాన్ చేస్తోందట.కొన్నేళ్లుగా ఫీల్ గుడ్ మూవీస్ లో కనిపిస్తూ వస్తున్నాడు తేజ్.అందుకే ఈసారి మాస్ మసాలా మూవీతో తిరిగి రావాలనుకుంటున్నాడట.

Advertisement
 
Advertisement
Advertisement