స‌డ‌క్ 2: ద‌రిద్రంగా ఉందంటున్న నెటిజ‌న్లు

Sadak 2: World Worst Rated Movie With 1 Star In IMDB - Sakshi

స్టార్ డైరెక్ట‌ర్ మ‌హేశ్ భ‌ట్ నిర్మించిన‌, ఆయన కూతురు, హీరోయిన్ అలియా భ‌ట్ న‌టించిన తాజా చిత్రం "స‌డ‌క్ 2". ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక డిస్‌లైకులు తెచ్చుకున్న రెండో యూట్యూబ్ వీడియోగా రికార్డుకెక్కిన విష‌యం తెలిసిందే. చూస్తుంటే ఇప్పుడు సినిమా కూడా రికార్డులు కొట్టేట‌ట్లు క‌నిపిస్తోంది. ఆగ‌స్టు 28న ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం ప‌ర‌మ‌ చెత్త‌గా ఉందంటూ 35 వేల‌కు పైగా ప్రేక్ష‌కులు ఐఎండీబీలో 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇంకా ఎంతోమంది ఇదే రేటింగ్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఐఎండీబీలో అత్యంత హీన‌మైన రేటింగ్ ద‌క్కించుకున్న చిత్రంగా స‌డ‌క్ మొద‌టి స్థానంలో నిలిచింది. 1.3 స్టార్ రేటింగ్‌తో ట‌ర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది. (చ‌ద‌వండి: ప్ర‌పంచ రికార్డు కొట్టేసిన స‌డ‌క్ 2)

కాగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న నాటి నుంచి బాలీవుడ్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఆయ‌న‌కు స‌రైన గుర్తింపు, అవ‌కాశాలు ఇవ్వ‌లేదంటూ సుశాంత్ అభిమానులు స్టార్ సెల‌బ్రిటీల‌పై విరుచుకుప‌డ్డారు. నెపోటిజ‌మ్ మ‌హారాణి అంటూ అలియా భ‌ట్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆమె న‌టించిన 'స‌డ‌క్ 2' ట్రైల‌ర్ విడుద‌ల అవ‌గా దానికి డిస్‌లైక్‌లు కొడుతూ ఆగ్ర‌హావేశాల‌ను ప్ర‌ద‌ర్శించారు. తాజాగా సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుద‌ల‌వ‌డంతో మ‌రోసారి రేటింగ్స్‌తో త‌మ ప్ర‌తాపాన్ని చూపించారు. 'సినిమా ద‌రిద్రంగా ఉంది', 'ఒక్క స్టార్ ఇవ్వ‌డ‌మే ఎక్కువ'‌, 'న‌టన‌ అస్సలు బాగోలేదు', 'ఫ‌స్టాఫే బోర్ కొట్టేసింది' అంటూ నెటిజ‌న్లు ఒక‌టికి మించి రేటింగ్ ఇవ్వ‌డం లేదు. (చ‌ద‌వండి: ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్‌.. అదుర్స్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top