‘శాకిని డాకిని' మూవీ ట్విట్టర్‌ రివ్యూ  | Sakshi
Sakshi News home page

Saakini Daakini Twitter Review: ‘శాకిని డాకిని' టాక్‌ ఎలా ఉందంటే..

Published Fri, Sep 16 2022 12:42 PM

Saakini Daakini Movie Twitter Review In Telugu - Sakshi

రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ లీడ్‌ రోల్స్‌లో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని'.డి.సురేష్‌ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)విడుదలయ్యింది. యాక్షన్‌, డ్రామా, హాస్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. కొరియన్ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శాకిని డాకిని' చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ రివ్యూ ఏంటో మీరే చూసేయండి.

అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్‌ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు. అలాగే ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారని,సెకండ్‌ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement