కథ విని ఎగ్జయిట్‌ అయ్యాను | Rupesh Kumar Chaudhary talking about 22 movie | Sakshi
Sakshi News home page

కథ విని ఎగ్జయిట్‌ అయ్యాను

Aug 2 2020 4:57 AM | Updated on Aug 2 2020 4:57 AM

Rupesh Kumar Chaudhary talking about 22 movie - Sakshi

రూపేష్‌ కుమార్‌ చౌదరి

‘‘నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే ఆసక్తి. కానీ మాది బిజినెస్‌ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కన్వి¯Œ ్స చేసి ఈ రంగంలోకి వచ్చాను. నటన నాకు ఇష్టమైన పని కావడంతో సంతృప్తినిస్తోంది’’ అని రూపేష్‌ కుమార్‌ చౌదరి అన్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘22’. దర్శకులు పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, మారుతిల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన శివకుమార్‌ బి. తెరకెక్కిస్తున్నారు. మా ఆయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై సుశీలా దేవి నిర్మిస్తున్నారు. రూపేష్‌ పుట్టినరోజు నేడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘శివ చెప్పిన ‘22’ కథ విని ఎగ్జయిట్‌ అయ్యాను. మొదటి సినిమాలోనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేయడం గర్వంగా ఉంది. ‘టెంపర్‌’లో ఎన్టీఆర్, ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌ కల్యాణ్‌ చేసిన పోలీస్‌ క్యారెక్టర్లతో పాటు కొంత మంది రియల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. మమ్మల్ని సపోర్ట్‌ చేసిన వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, సాయితేజ్, వి.వి. వినాయక్, సి. కల్యాణ్,  పూరి జగన్నాథ్, మారుతిగార్లకు థ్యాంక్స్‌. బి.ఎ రాజుగారి వల్లే ఈ  సినిమాకు అంత హైప్‌ వచ్చింది. మా సినిమా ఓటీటీ, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కోసం కూడా సంప్రదిస్తున్నారు. కానీ థియేటర్లు ప్రారంభం కాగానే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement