RRR బాలీవుడ్ మూవీ కాదు, తెలుగు చిత్రం.. గర్వంగా చెప్పిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇండియన్ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టిన ఈ చిత్రం..ఇప్పుడు విదేశీ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది. అంతేకాదు ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును దక్కించుకొని ఔరా అనిపించింది.
‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఈ అవార్డును అందుకుంది. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈ సినిమాకు దక్కడంతో, కచ్చితంగా ఆస్కార్ అవార్డును సైతం అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ ఇండియన్ చిత్రం కావడంతో విదేశీయులంతా ఇది బాలీవుడ్ మూవీ అని భావిస్తున్నారు. కానీ ఇది పక్కా తెలుగు చిత్రం అని రాజమౌళీ గర్వంగా చెప్పారు. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్ బాలీవుడ్ మూవీ కాదు.. సౌత్ ఇండియన్ ఫిల్మ్..తెలుగు చిత్రం’అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH: #SS Rajamouli says,
"#RRR is a #Telugu film, not #Bollywood!"#USA #entertainment @ssrajamouliFC @JrNTRDevotees @AlwayzRamCharan @TeamAliaTelugu @SSRajamouli_FC @JrNTRFanGirls @The_RamCharanFC @aliabhattfan7 #GoldenGlobes2023 #GoldenGlobes #award @ssrajamouli_fan #news pic.twitter.com/hWwUDv0bjo— News9 (@News9Tweets) January 12, 2023
మరిన్ని వార్తలు :