'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. సంక్రాంతి కానుకగా | Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. సంక్రాంతి కానుకగా

Published Fri, Jan 14 2022 5:06 PM

RRR Movie Special Poster On The Sankranti Eve - Sakshi

RRR Movie Special Poster On The Sankranti Eve: దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరగడం, థియేటర్‌ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్‌డౌన్‌ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్‌పోన్ చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సమర్ధించారు. సినిమా విడుదల సంగతి దర్శకనిర్మాతలు చూసుకుంటారు అని తేల్చి చెప్పాడు. 

సినిమా వాయిదా పడింది అని అసహనంతో ఉన్న ప్రేక్షకులను మెప్పించేందుకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్‌. ఈ  సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఇందులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ భుజాలపై కర్ర పట్టుకుని, రామ్‌ చరణ్‌ స్టైలిష్‌గా నడుస్తూ కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కొమురం భీంగా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజయ్ దేవగణ్‌, అలియా భట్‌ వంటి బాలీవుడ్‌ స్టార్స్‌తోపాటు పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ కనిపించనున్నారు. 
 


ఇదీ చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు అమెజాన్‌ భారీ ఆఫర్‌.. కానీ

Advertisement
 
Advertisement
 
Advertisement