ముచ్చటగా మూడో కారు కొన్న లేడీ కమెడియన్‌ | Rowdy Rohini Buys New Kia Seltos Car, Check Price Details | Sakshi
Sakshi News home page

Rowdy Rohini: కొత్త కారు కొన్న రౌడీ రోహిణి.. ధరెంతో కూడా చెప్పేసింది!

Jan 6 2024 1:42 PM | Updated on Jan 6 2024 1:55 PM

Rowdy Rohini Buys New Kia Seltos Car, Check Price Details - Sakshi

నిజానికి ఆడి కారు కొందామనుకున్నాను. కానీ దాని ప్రారంభ ధర రూ.57 లక్షల దాకా ఉంది. లోన్‌ పెట్టుకోవచ్చనుకున్నాను. కానీ ఎప్పుడెలా ఉంటుందోనని ఆ ఆలోచన విర

సీరియల్‌ నటి, కమెడియన్‌ రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు రౌడీ రోహిణిగానే బాగా సుపరిచితం. మొదట్లో సీరియల్స్‌లో కనిపించిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్‌, అదిరింది వంటి కామెడీ షోలు సైతం చేసింది. 'మత్తు వదలరా', 'బలగం' వంటి సినిమాల్లో వినోదాన్ని పంచింది. 'సేవ్‌ ది టైగర్స్‌' వెబ్‌ సిరీస్‌లో ఆమె చేసే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే! ఆ టాలెంటెడ్‌ నటి తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొంది.

కొత్త కారు ధరెంతంటే?
తాజాగా రోహిణి కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా వెల్లడించింది. మొదటి కారు యాక్సిడెంట్‌లో దెబ్బతిందని, రెండో కారును ఈ మధ్యే అమ్మేయగా ఇప్పుడు ముచ్చటగా మూడో కారు కొన్నట్లు చెప్పింది. ఇది కియా సెల్టోస్‌ జీటీఎక్స్‌ ప్లస్‌ బ్రాండ్‌కు చెందినదంటూ తన కొత్త కారును చూపించింది. దానికి పూజ కూడా చేయించి. రోహిణి మాట్లాడుతూ.. 'మొదటి కారును రూ.9 లక్షలు పెట్టి తీసుకున్నాను. రెండో కారు కోసం రూ.14 లక్షలు పెట్టాను. ఇప్పుడీ కొత్త కారును రూ.25 లక్షలు పెట్టి తీసుకున్నాను.

అదొక్కటే మిగిలుంది
నిజానికి ఆడి కారు కొందామనుకున్నాను. కానీ దాని ప్రారంభ ధర రూ.57 లక్షల దాకా ఉంది. లోన్‌ పెట్టుకోవచ్చనుకున్నాను. కానీ ఎప్పుడెలా ఉంటుందోనని ఆ ఆలోచన విరమించుకున్నాను. చాలామంది నాకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియవు కాబట్టి భూమి కొనుక్కోమని చెప్పారు. నిజమే కదా అనిపించింది. ఇప్పటికైతే ఇల్లు, కారు కొనేశాను.. ఎక్కడైనా ప్లాట్‌ తీసుకుని అది అమ్మానాన్న పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి వారికి బహుమతిగా ఇవ్వాలి. అదొక్కటే మిగిలి ఉంది' అని చెప్పుకొచ్చింది రోహిణి.

చదవండి: ఒక్క పూట భోజనం.. ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించకుండా తినేవాడిని.. ప్రముఖ నటుడి కష్టాలు

Advertisement
 
Advertisement
Advertisement