ఆ బాలీవుడ్‌ స్టార్‌తో నన్ను పోల్చవద్దు: హీరో | Actor RJ Balaji Says Do Not Compare With Aamir Khan, Deets Inside - Sakshi
Sakshi News home page

RJ Balaji: అలా అంటే భయమేసింది, ఆ స్టార్‌ హీరోతో నన్ను పోల్చకండి..

Published Sat, Feb 3 2024 9:54 AM

RJ Balaji Says Do not Compare with Aamir Khan - Sakshi

తమిళ హీరో ఆర్‌జే బాలాజి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింగపూర్‌ సెలూన్‌. మీనాక్షిచౌదరి హీరోయిన్‌గా నటించిన ఇందులో సత్యరాజ్‌, లాల్‌, అరవిందస్వామి ముఖ్య పాత్రలు పోషించారు. గోకుల్‌ దర్శకత్వం వహించగా వేల్స్‌ ఫిలిం ఇంటర్‌నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మించారు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సింగపూర్‌ సెలూన్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

అలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉంటే బాగుండు
ఈ సందర్భంగా ఆర్‌జే బాలాజి మాట్లాడుతూ.. సింగపూర్‌ సెలూన్‌ చిత్ర విజయం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ మూవీలోని అరవిందస్వామి పాత్రను చూసి ఇలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే బాగుండని చాలా మంది అనుకున్నారన్నారు. అంత ఉత్తమ నటనను ప్రదర్శించిన అరవిందస్వామికి ధన్యవాదాలు తెలిపారు. తొలివారంలో ప్రేక్షకులకు నచ్చేసిన ఈ చిత్రం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబట్టాలనే ఈ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశామన్నారు.

ఆయనతో పోల్చొద్దు
నటుడు చిన్ని జయంత్‌ తనను సౌత్‌ ఇండియన్‌ అమీర్‌ ఖాన్‌ అని పేర్కొనడంతో భయం కలిగిందన్నారు. ఆయన లెజెండ్‌ అని, ఆయనతో తనను పోల్చరాదన్నారు. తనలోని నటనను బయటకు తీసిన దర్శకుడు గోకుల్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిర్మాత ఐసరి గణేశ్‌ తనకు తండ్రి లాంటివారని, ఎల్‌కేజీ 2, మూక్కుత్తి అమ్మన్‌ 2 చిత్రాలను చేయాలన్న ఆలోచన ఉందని, వాటిని ఐసరి గణేశ్‌ సంస్థలోనే చేస్తానని చెప్పారు.

చదవండి: 'దమ్‌ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్‌.. మిలియన్లకొద్ది వ్యూస్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement