డ్రగ్‌ డీలర్‌తో రియా చాట్‌.. అరెస్ట్‌!

Rhea Chakraborty WhatsApp Chat Exposes Drug Connection - Sakshi

ముంబై : బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ బయట పడుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న ఈ కేసులో సుశాంత్‌ మరణం వెనక ఉన్న విషయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుతో ముడిపడిన పలువురిన సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని సోమవారం సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా రియా డ్రగ్స్‌ గురించి మాట్లాడుతున్న వాట్సాప్‌ చాట్స్‌ బయటపడింది. రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు. (సుశాంత్‌ ఇంటి ముందు ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరంటే!)

అయితే, సీబీఐ కంటే ముందు.. బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది. డ్రగ్స్‌ గురించి వాట్సాప్‌ చాట్‌లో రియా సంభాషించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రియా ఫోన్‌ డేటాను విశ్లేషించేందుకు సీడీఐ ఈడీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా రియా, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. 

ఇందులో డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో రియా చాట్‌ చేసింది. ఈ చాట్‌లో మొదట ‘నేను ఎక్కువ డ్రగ్స్‌ వాడలేదు’ అనే మెసేజ్‌ను రియా..గౌరవ్‌కు 2017 మార్చి 8న పంపింది. రెండో సారి ‘మీ వద్ద ఎంపీ ఉందా’ అని రియా గౌరవ్‌ను ప్రశ్నించింది. మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌గా ఎంపీగా పరిగణిస్తారు. అయితే ఇది బలమైన డ్రగ్‌ అని తెలుస్తోంది. కాగా ఆ ఇటీవల మహేష్‌ భట్‌, రియా వాట్సాప్‌ చాట్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  (‘పోస్ట్‌మార్టం కావాలనే ఆలస్యం చేశారు’)

అంతేగాక శామ్యూల్ మిరాండా, రియా మధ్య జరిగిన చాట్‌ను కూడా వెల్లడైంది. ఇందులో.. 'హాయ్ రియా, విషయం దాదాపుగా ముగిసింది. అని మిరాండా చెప్పారు. ఈ సంభాషణ 2020 ఏప్రిల్ 17 న జరిగింది. ఆ తరువాత మేము షోవిక్ స్నేహితుడి నుంచి డ్రగ్స్ తీసుకోవచ్చా? కానీ అతని దగ్గర హాష్, (బడ్‌) మొగ్గ మాత్రమే ఉన్నాయి. అని మిరాండా రియాను అడిగారు. అయితే హాష్, మొగ్గ అనేవి తక్కువ తీవ్రత కలిగిన డ్రగ్స్‌గా పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం డ్రగ్‌ డీలర్‌తో జరిగిన ఈ సంభాషణను చూస్తుంటే రియాపై మరింత అనుమానాన్ని పెంచుతున్నాయి. రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (‘ఆ రోజు సుశాంత్‌ డ్రగ్‌ డీలర్‌ని కలిశాడు’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top