సుశాంత్ కేసు: రియాకు సీబీఐ సమన్లు

ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును విచారిస్తున్న సీబీఐ హీరో గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసింది. ఈ రోజు(శుక్రవారం) విచారణకు హాజరు కావలని రియాకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రియా చేరుకున్నారు. రియాతోపాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీని మరోసారి ప్రశ్నించనున్నాను. రియా సోదరుడిని 14 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. సుశాంత్ ఇంటి సిబ్బంది, స్నేహితుడు సిద్దార్ధ్‌ను కూడా విచారించారు. సుశాంత్‌ది అసలు ఆత్మహత్యా? లేదా హత్యా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. (సుశాంత్ మెసేజ్ చేశాడు.. బ్లాక్ చేశా: రియా)
రియా తన కొడుకును మానసికంగా వేధించిందని, డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న క్రమంలో గత వారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ సుశాంత్ కేసులో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. సుశాంత్ తండ్రి బిహార్‌లో ఫిర్యాదు చేసిన కేసు ఆధారంగా రియా, ఆమె కుటుంబాన్ని సీబీఐ విచారిస్తోంది. రియా చక్రవర్తి తండ్రి, సోదరుడిని అధికారులు ప్రశ్నించగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానీని కూడా ఏడు రోజుల పాటు ప్రశ్నించారు. (అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి