RGV Tweets On Pawan Kalyan Bheemla Nayak Movie - Sakshi
Sakshi News home page

RGV: 'అల్లు అర్జున్‌ గురించి పెట్టిన ట్వీట్స్‌ వోడ్కా టైంలో పెట్టాను'

Jan 31 2022 12:51 PM | Updated on Jan 31 2022 5:14 PM

Rgv Tweets On Pawan Kalyan And Bheemla Nayak Movie - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయన్ని పాన్‌ ఇండియా స్టార్‌గా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్‌ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని కోరారు. ఇటీవలె విడుదల పుష్ప హిందీలో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్‌ సాధించిందని, మరి  భీమ్లానియక్‌ ఇంకెంత కలెక్ట్‌ చేయాలి అంటూ ప్రశ్నించారు.

ఇటీవలె అల్లు అర్జున్‌ గురించి పెట్టిన ట్వీట్స్‌ అన్నీ వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్‌ నా కాఫీ టైంలో పెడుతున్నా.  దీన్ని బట్టి నా సీరియస్ నెస్‌ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు పాన్‌ ఇండి స్టార్లుగా అయిపోతుంటే, మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి భీమ్లానాయక్‌ని పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయండి అని వర్మ వరుస ట్వీట్లతో హీటెక్కించారు. ప్రస్తుతం పవన్‌పై వర్మ చేసిన ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement