Rewind 2021: సిగ్నేచర్ స్టెప్స్‌తో అదరగొట్టిన స్టార్‌ హీరోలు | Rewind 2021: Balakrishna, NTR,Ram Charan Signature Steps Goes Viral | Sakshi
Sakshi News home page

Rewind 2021: సిగ్నేచర్ స్టెప్స్‌తో అదరగొట్టిన స్టార్‌ హీరోలు

Jan 1 2022 10:55 AM | Updated on Jan 1 2022 11:25 AM

Rewind 2021: Balakrishna, NTR,Ram Charan Signature Steps Goes Viral - Sakshi

2021.. టాలీవుడ్ ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది. కరోనా కాలంలోనూ వసూళ్లను అందుకోవడం మిగితా ఇండస్ట్రీస్ పోలిస్తే విజయాల శాతం ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు ఆడియెన్స్ లో కూడా జోష్ తీసుకొచ్చింది. సిగ్నేచర్ స్టెప్స్ తో దుమ్మురేపాయి.

2021 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్  కేవలం కలెక్షన్స్ తో సరిపెట్టుకోలేదు. థియేటర్స్ కు పూర్వ వైభవం మాత్రమే తీసుకురాలేదు. ఆడియెన్స్ కు కూడా కిక్ తీసుకోచ్చాయి.
వాళ్లతో స్టెప్పులేయించాయి. ముఖ్యంగా హీరోల సిగ్నచర్ స్టెప్స్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అఖండలో బాలయ్య వేసిన షర్ట్ స్టెప్ ఈ ఏడాది ఒక హైలైట్. ఇటీవల అన్ స్టాపబుల్ టాక్ షోకి విచ్చేసిన రవితేజ కూడా ఇదే స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

మాస్ రాజా మాత్రమే కాదు..మరో కథానాయిక నివేదా ధామస్ కూడా బాలయ్య స్టెప్ ను రిపీట్ చేసేందుకు బాగానే ట్రై చేసింది. ఇక అటు రీల్స్ లో, ఇటు షార్ట్స్ లోనూ ఈ జై బాలయ్య హుక్ స్టెప్ దే హవా

జనవరి 7న రిలీజ్ అవుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి చాలా ట్రైలర్స్, టీజర్స్, వచ్చాయి. కాని నాటు నాటు సాంగ్ మాత్రం ఒక్కసారిగా వైరల్ అయింది. జై బాలయ్య స్టెప్ తో పాటు నాటు నాటు కూడా పాన్‌ ఇండియా రేంజ్ లో దుమ్మురేపుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్ ఇండియా ప్రమోషన్ లో ఈ స్టెప్ రిపీటెడ్ గా కనిపించింది. బిగ్ బాస్ సెట్ లో తారక్, చరణ్ తో కలసి సాక్షాత్తు సల్మాన్ ఖాన్, ఈ హుక్ స్టెప్ వేసాడు. నాటు నాటు పై  లెక్కనేనన్ని కవర్ సాంగ్స్ వచ్చాయి..స్టిల్ వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది.

పుష్ప లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్.ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఈ పాటలు దుమ్మురేపుతున్నాయి. ఈ మూవీలో సామి సామి సాంగ్ కోసం రష్మిక వేసిన హుక్ స్టెప్ కూడా చాలా పాపులర్ అయింది. సినిమా ప్రమోషన్  ఎక్కడ జరిగినా, అక్కడ రష్మిక ఈ హుక్ స్టెప్ వేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement