ముచ్చటగా మూడోసారి.. మాస్ మహారాజా మూవీ టైటిల్‌ ఫిక్స్! | Raviteja Latest Movie Title Fix with Director Harish Shankar | Sakshi
Sakshi News home page

Raviteja: క్రేజీ కాంబోలో మరో మూవీ.. ఆ స్టార్ హీరో పాత్రలో మాస్ మహారాజా!

Dec 17 2023 11:56 AM | Updated on Dec 17 2023 1:15 PM

Raviteja Latest Movie Title Fix with Director Harish Shankar - Sakshi

మాస్ మహారాజా రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మిరపకాయ్‌ వంటి మాస్‌ హిట్‌ను అందించిన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని రవితేజ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

హరీశ్- రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్‌లో రవితేజ కూర్చుని స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. 

కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు. ఈ విషయాన్ని మాస్‌ మహారాజాతో క్లాస్‌ మహారాణి అంటూ  చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement