'టైగర్‌ నాగేశ్వరరావు' వేట మొదలైంది.. స్టన్నింగ్‌గా ప్రీ లుక్ | Ravi Teja Tiger Nageswara Rao Pre Look Released By Chiranjeevi | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao Movie: 'టైగర్‌ నాగేశ్వరరావు' వేట మొదలైంది.. స్టన్నింగ్‌గా ప్రీ లుక్

Apr 2 2022 2:11 PM | Updated on Apr 2 2022 2:30 PM

Ravi Teja Tiger Nageswara Rao Pre Look Released By Chiranjeevi - Sakshi

'శ్రీ శుభకృత్‌ నామ' తెలుగు సంవత్సరం కానుకగా ఉగాది పర్వదినాన ఈ ప్రీలుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ ఒక ట్రైన్‌ ముందు స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రీ లుక్‌ టీజర్‌లో బీజీఎం అద్భుతంగా ఉంది. వేట మొదలైంది అంటూ ఈ ప్రీ లుక్‌కు క్యాప్షన్ ఇచ్చారు. 

Ravi Teja Tiger Nageswara Rao Pre Look Released By Chiranjeevi: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా డౌన్‌ టు ఎర్త్‌ వ్యక్తిగా పేరు సంపాందించుకున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా నుంచి ప్రీ లుక్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. 'శ్రీ శుభకృత్‌ నామ' తెలుగు సంవత్సరం కానుకగా ఉగాది పర్వదినాన ఈ ప్రీలుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో రవితేజ ఒక ట్రైన్‌ ముందు స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రీ లుక్‌ టీజర్‌లో బీజీఎం అద్భుతంగా ఉంది. వేట మొదలైంది అంటూ ఈ ప్రీ లుక్‌కు క్యాప్షన్ ఇచ్చారు. 

చదవండి: టైగర్‌ నాగేశ్వరరావు మూవీలో గాయత్రి భరద్వాజ్‌

రవితేజ కెరీర్‌లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా వస్తోంది 'టైగర్ నాగేశ్వరరావు'. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ లాంచ్‌ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. అలాగే సినిమా యూనిట్‌గా విషెస్‌ తెలియజేశారు. ఈ చిత్రం క్రైమ్‌ డ్రామాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు'కు జోడిగా ప్రముఖ మోడల్‌ గాయత్రి భరద్వాజ్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ చెల్లెలు నుపుర్‌ సనన్‌ అలరించనున్నారు. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జివి. ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. 



చదవండి: గజదొంగ బయోపిక్‌లో రవితేజ..ఎవరీ టైగర్ నాగేశ్వరరావు?

Advertisement
 
Advertisement
Advertisement