Ravi Teja Talk About Ramarao On Duty Movie At Trailer Launch Event - Sakshi
Sakshi News home page

Ramarao On Duty: అందులో ఒక్క శాతం కూడా డౌట్‌ లేదు: రవితేజ

Jul 17 2022 9:04 AM | Updated on Jul 17 2022 11:30 AM

Ravi Teja Talk About Ramarao On Duty Movie - Sakshi

సుధాకర్‌, శరత్‌, దివ్యాంశ, రవితేజ, అనిల్‌ రావిపూడి

‘‘తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి)... ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ట్రైలర్‌ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది.. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నాజర్‌గారు చెప్పినట్టు శరత్‌ చాలా మంచి సినిమా తీశాడు. అందులో ఒక్క శాతం కూడా డౌట్‌ లేదు’’ అని రవితేజ అన్నారు. శరత్‌ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అభిమానుల మధ్య ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన మా మాస్‌ మహారాజ ఫ్యాన్స్‌కు, డైరెక్టర్లు అనిల్, త్రినాథరావు, సుధీర్, వంశీగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు.

(చదవండి: ‘ది వారియర్‌’ మరోసారి అది నిరూపించింది: రామ్‌ పోతినేని)

శరత్‌ మండవ మాట్లాడుతూ– ‘‘ఆర్‌టీఎఫ్‌ (రవితేజ ఫ్యాన్స్‌) అనే హ్యాష్‌ట్యాగ్‌తో నన్ను సపోర్ట్‌ చేసిన రవితేజగారి అభిమానులకు థ్యాంక్స్‌. ప్రస్తుతం చాలామంది కథలు రాస్తున్నారు. ప్రత్యేకించి ఓ సినిమా కథ బాగా హైలెట్‌ కావాలంటే నటుడు వెన్నెముకలాంటివాడు. తెలుగు ఇండస్ట్రీలో రవితేజగారు ఉండటం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇండస్ట్రీలో ఉండటం నాలాంటి వారికి స్ఫూర్తి.. అదృష్టం కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్లను చాలామందిని పరిచయం చేశారు. కొత్త ఐడియాలను, కొత్త కథలను ఆయనెప్పుడూ స్వాగతిస్తారు. 29న థియేటర్లలో కలుద్దాం.. రామారావుగారి డ్యూటీ మిమ్మల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఈ వేడుకలో నటుడు నాజర్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement