రవితేజ ‘రావణాసుర’ థీమ్‌ సాంగ్‌ విన్నారా? | Ravi Teja Ravanasura theme song released | Sakshi
Sakshi News home page

Ravanasura: రవితేజ ‘రావణాసుర’ థీమ్‌ సాంగ్‌ విన్నారా?

Feb 7 2023 6:29 AM | Updated on Feb 7 2023 10:23 AM

Ravi Teja Ravanasura theme song released - Sakshi

సుశాంత్, దక్ష, రవితేజ

రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ కీలక పాత్ర చేస్తున్నారు. అభిషేక్‌ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్, భీమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా ‘రావణా..’ అంటూ సాగే థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ థీమ్‌ సాంగ్‌ని కంపోజ్‌ చేయగా, పాపులర్‌ మ్యూజిక్‌ వేదిక్‌ బ్యాండ్‌ శాంతి పీపుల్, నోలిక్‌ ఈ థీమ్‌ సాంగ్‌ని ఆలపించారు. ‘‘హై ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’. రవితేజను లాయర్‌ పాత్రలో చూపిస్తున్నారు సుధీర్‌ వర్మ. కథలో ఊహించని మలుపులుంటాయి. ఏప్రిల్‌ 7న మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement