అఫీషియల్: ఓటీటీలో 'ధమాకా'.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్ | Sakshi
Sakshi News home page

Dhaamaka Movie OTT Release Date: ఓటీటీలో 'ధమాకా'.. స్ట్రీమింగ్‌ డేట్ ఇదే

Published Thu, Jan 12 2023 4:33 PM

Ravi Teja Dhamaka Movie OTT Release Date Fix On Netflix January 22 - Sakshi

మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్‌ ప్రేక్షకులకు కట్టి పడేశాయి.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిటిటల్‌ రైట్స్‌ను దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement