
పగ తీర్చుకోవడానికి పక్కా ప్రణాళిక వేస్తున్నారు బాలీవుడ్ నటి రవీనా టాండన్. అమెరికన్ టెలివిజన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘రివెంజ్’ హిందీ రీమేక్‌లో రవీనా టాండన్ నటించనున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిజం అని నిర్ధారిస్తూ.. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు రవీనా. ఇక ఈ ‘రివెంజ్’ వెబ్ సిరీస్ హిందీ అడాప్షన్‌కు దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు.
కాగా 2021లో వచ్చిన ‘ఆర్యాంక్’ వెబ్ సిరీస్ తర్వాత రవీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదే. ఇక ‘రివెంజ్’ కథ విషయానికి వస్తే... కొందరి స్వార్థపరుల ఆత్యాశ వల్ల హత్య చేయబడిన తన తండ్రి కోసం ఓ యువతి చేసే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... జనవరి 26న వెలువడిన ‘పద్మ’ అవార్డుల్లో రవీనాకు పద్మశ్రీ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.