రతిక మంచి అమ్మాయి, తనను వాడుకున్నారు.. స్క్రీన్‌షాట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

Rathika Rose: ఎపిసోడ్‌ అవ్వకముందే ఎలిమినేషన్‌ కన్ఫామ్‌, టాప్‌ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్‌, ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..

Published Sat, Sep 30 2023 8:53 PM

Rathika Rose Instagram Storie Goes Viral - Sakshi

కొన్ని ఎలిమినేషన్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొందరు ఎలిమినేట్‌ అయితే ప్రేక్షకులే తెగ ఫీలైపోతారు. కానీ మరికొందరు ఎలిమినేట్‌ అయితే బిగ్‌బాస్‌ హౌస్‌కు పట్టిన శని పోయిందని పండగ చేసుకుంటారు. ఈసారి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే విషయం ఎప్పటిలాగే ఒక రోజు ముందే లీకైంది. బిగ్‌బాస్‌ బేబీ రతిక రోస్‌ హౌస్‌ నుంచి వచ్చేయనుందట! ఈ మేరకు ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రతిక రోస్‌ అఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చేసిన పోస్ట్‌ ఒకటి వైరల్‌గా మారింది.

రతికను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపండి..
'రతిక ఎలిమినేట్‌ కానుందంటూ ఒక అప్‌డేట్‌ వచ్చింది. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్‌. టాప్‌ 3లో ఉండేందుకు అర్హత ఉన్న కంటెస్టెంట్‌. అమర్‌దీప్‌ లాంటి కొందరు నెగెటివ్‌ వ్యక్తుల వల్ల తను తప్పుడుదారిలో నడిచింది. ప్లీజ్‌.. తనకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. ఆమెను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించండి. తన వెనకాల ఏం జరుగుతుందో ఈ గేమర్‌కు తెలియనివ్వండి. ఎవరు తన మంచి కోరుతున్నారు? ఎవరు వాడుకుంటున్నారో? తనకు తెలియజేయండి. రతిక చాలా మంచి అమ్మాయి. అమర్‌దీప్‌ లాంటి వాళ్లు నిన్ను వాడుకున్నారు' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు. ఇది చూసిన జనాలు మధ్యలో అమర్‌దీప్‌ ఎందుకు వచ్చాడు? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

రూల్స్‌కు విరుద్ధం కదా..
ఎలిమినేషన్‌కు ఇంకా ఒక రోజుంది.. అప్పుడే తను ఎలిమినేట్‌ అయిన విషయాన్ని కన్‌ఫామ్‌ చేసేశారేంటి? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రతిక ఇన్‌స్టాగ్రామ్‌ను హ్యాండిల్‌ చేస్తున్న వారికి.. ఇది బిగ్‌బాస్‌ రూల్స్‌కు విరుద్ధం అని కూడా తెలియదా అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతలోనే సదరు పోస్ట్‌ను రతికా రోజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలగించారు. అయినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ మాత్రం వైరల్‌గా మారింది.

చదవండి: 'స్కంద'లో రామ్‌ చెల్లెలిగా నటించిందెవరో తెలుసా? ఫుల్‌ ఫాలోయింగ్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement