ప్రేమలో పడిపోయా.. రష్మిక పోస్ట్‌ వైరల్‌

Rashmika Mandanna Writes Heartfelt Posted On Her Pet Dog Aura - Sakshi

అల్లరి పిల్ల, అందాల తారా రష్మిక మందన్నా మరోసారి ప్రేమలో పడిందట. అది కూడా కేవలం మూడు మిల్లీ సెకన్లనే పడిపోయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుందని తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడ్డానని రష్మిక తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి ప్రేమలో పడింది మనుషులతో కాదు, తన లిటిల్‌ పెట్‌ జౌరాతో. 

‘ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నాకు ఆనందాన్ని ఇచ్చిన నా లిటిల్‌ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ తన పెట్‌ డాగ్ ఫోటోస్‌ను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు రష్మిక మందన్న. ఆ ఫోటోలు సోషల్ మీడియాలొ వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుతం ఈ భామ తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’, శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

చదవండి:
అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్‌
‘ఆర్ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి సంచలన నిర్ణయం!

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top