Rashmika Mandanna: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు

Rashmika Mandanna Interesting Comments On Ranbir Kapoor - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న రష్మిక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇప్పటికే రెండు బాలీవుడ్‌ చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం యానిమల్‌ మూవీలో నటిస్తోంది. ఇందులో చాక్లెట్ బాయ్‌ రణ్‌బీర్‌తో ఆమె జోడి కట్టింది.

చదవండి: పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

‘అర్జున్‌ రెడ్డి’ ఫేం సందీప్‌ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవల మనాలీలో తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించిన రష్మిక యానిమల్‌ మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మూవీతోనే తొలిసారి రణ్‌బీర్‌ను కలిశానని, మొదటి సారి ఆయనను కలవడం, ఆయనతో నటించనుండటంతో నెర్వస్‌గా ఫీల్‌ అయ్యానని చెప్పింది. ‘నిజానికి రణ్‌బీర్ మంచి వ్యక్తి  అయినప్పటికీ మొదటిసారి కలిసినప్పుడు భయంగా అనిపించింది.

చదవండి: అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి: ఆసక్తిగా హీరోయిన్‌ ట్వీట్‌

సెట్‌లో అతడిని కలసిన ఐదు నిమిషాలకే మా మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సందీప్, రణ్‌బీర్‌లతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. అయితే రణ్‌బీర్‌ నన్ను మేడం అని పిలుస్తాడు. సినీ ఇండస్ట్రీలో నన్ను అలా పిలిచిన వ్యక్తి రణ్‌బీర్ కపూర్ ఒకడే. కానీ ఆయన అలా పిలవడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పుకొచ్చింది. ‘యానిమల్’ ను టి-సిరీస్, సినీ 1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియాగా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. రష్మిక ఇందులో గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top