Is Rashmika Mandanna Ex Boyfriend Going To Marry Divya Spandana, Deets Inside - Sakshi
Sakshi News home page

Rakshit Shetty Marriage Rumours: ఆ నటిని పెళ్లాడనున్న రష్మిక మందన్నా మాజీ ప్రియుడు

May 21 2022 11:10 AM | Updated on May 21 2022 12:03 PM

Is Rashmika Mandanna Ex Boyfriend Going To Marry Divya Spandana, Deets Inside - Sakshi

తాజాగా రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం చార్లీ 777 సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రక్షిత్‌ రమ్య అనే అమ్మాయిని పెళ్లాడబోతు

కన్నడ మూవీ కిరిక్‌ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసింది రష్మిక మందన్నా. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడింది. దీంతో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు చేసిన రష్మిక 2018లో ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గీతాగోవిందం సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పుష్ప మూవీతో పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది.

ప్రస్తుతం 'చార్లీ 777' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రక్షిత్‌.. రమ్య అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో రక్షిత్‌ స్నేహితుడు, నటుడు రిషబ్‌ శెట్టి ఈ వార్తలపై స్పందిస్తూ.. మావాడికి సాండల్‌వుడ్‌ గోల్డెన్‌ గర్ల్‌తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా రక్షిత్‌ రమ్యను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే రక్షిత్‌ సైతం ఈ రూమర్లపై స్పందిస్తూ ఇంతవరకు ఆమెను అసలు కలవలేదని బదులిచ్చాడు. కాకపోతే తాను నటించిన 'ఉలిదవవరు కందంటే' సినిమా బాగుందని ఆమె ఓసారి తనను మెచ్చుకుందన్నాడు. చాలామందిలాగే తనకు కూడా కాలేజీ రోజుల్లో రమ్య అంటే క్రష్‌ ఉండేదని, అంతకుమించి ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. రమ్య తప్పకుండా ఏదో ఒకరోజు తిరిగి సినిమాల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

చదవండి 👉🏾  ఆస్కార్‌ కొత్త రూల్స్‌.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట!

మొన్నటిదాకా మహానటిని, ఇప్పుడు కళావతిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement